జాతిపిత మహాత్మా గాంధీ జయంతి

నర్సాపూర్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలో ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామంలో చెత్త బుట్టలను పంపిణీ చేసి, శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛతతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, మానవత్వం, సామాజిక న్యాయం వంటి...