prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 3:01 pm Digital Edition : PRAJA VANI

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి

నర్సాపూర్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలో ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం రెడ్డిపల్లి గ్రామంలో చెత్త బుట్టలను పంపిణీ చేసి, శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛతతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, మానవత్వం, సామాజిక న్యాయం వంటి మహోన్నత విలువలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. గాంధీజీ కలలు కన్న సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదలు, బలహీనవర్గాలు, అణగారిన ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయడమే మహాత్మా గాంధీకి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, రెడ్డిపల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి మేఘమాల, శ్రవణ్ కుమార్,కార్యదర్శి స్వాతి, నాయకులు,రాధకృష్ణ, రషీద్,సుధీర్ కుమార్, ఆంజనేయులు,నరేష్, సందీప్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనారు