prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:41 pm Digital Edition : PRAJA VANI

జాతిపితకు నివాళులర్పించిన ఎమ్మెల్యే కుంభం

*జాతిపితకు నివాళులర్పించిన ఎమ్మెల్యే కుంభం…*

*పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*

గాంధీ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణం గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశానికి ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించు కున్నారు. గాంధీజీ చూపిన సత్యం , అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసు కోవాలన్నారు. ఈ కార్య క్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి , మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి , జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అవేస్ చిస్తి , ఆర్డీఓ కృష్ణారెడ్డి , మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల , ఆత్మ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి , భువనగిరి పిఎసిఎస్ చైర్మన్ కొండల్ రెడ్డి , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు , పట్టణ కౌన్సిలర్లు , కో-ఆప్షన్ సభ్యులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు , అభి మానులు తదితరులు పాల్గొన్నారు.