prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 6:54 pm Digital Edition : PRAJA VANI

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పెంపు

*జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పెంపు*

జనగామ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03(ప్రజావాణి):
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి గాను 9వ మరియు 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న “లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027” (JNV LEST-2027) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 15, 2026 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి జవహర్ నవోదయ విద్యాలయం, మామూనూర్, వరంగల్ ప్రిన్సిపాల్ టి రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యాలయాల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో భాగంగా ఈ ఖాళీ సీట్లను భర్తీ చేస్తున్నారని, CBSE అనుబంధం, NCERT పాఠ్యప్రణాళికతో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నివాస విద్యను అందించడం నవోదయ పాఠశాలల ప్రత్యేకత అని పేర్కొన్నారు.

అర్హతల వివరాలు:
9వ తరగతి ప్రవేశానికి:
వయోపరిమితి: విద్యార్థి 01-05-2012 నుండి 31-07-2014 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలూ వర్తిస్తాయి).
విద్యార్హత: ప్రస్తుతం (2026–27 విద్యా సంవత్సరంలో) సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉండాలి.

11వ తరగతి ప్రవేశానికి:
వయోపరిమితి: విద్యార్థి 01-06-2010 నుండి 31-07-2012 మధ్య జన్మించి ఉండాలి.
o విద్యార్హత: ప్రస్తుతం (2026–27 విద్యా సంవత్సరంలో) సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉండాలి.

ముఖ్యమైన వివరాలు & రిజర్వేషన్లు :
• ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2026
• ఎంపిక పరీక్ష తేదీ: 10-04-2027
• సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25% పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించబడతాయని (చదువులో ఏ కొద్ది భాగమైనా మున్సిపాలిటీ/కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలో చదివితే పట్టణ విద్యార్థిగా పరిగణిస్తారు).

• నిబంధనల ప్రకారం SC, ST, దివ్యాంగులు (PH) మరియు బాలికలకు ప్రత్యేక రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు.

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ ద్వారా 9వ మరియు 11వ తరగతులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న లింక్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చునని మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరని ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.