జవహర్‌నగర్‌ పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

జవహర్‌నగర్‌, అక్టోబర్ 14(ప్రజావాణి):- పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మేడ్చల్‌ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కలాశెట్టి దినేష్‌కుమార్‌కు వివిధ సెక్షన్ల కింద శిక్షలు, జరిమానాలు విధించడంతో పాటు బాధితురాలికి రూ.50 వేల పరిహారం అందించాలని ఆదేశించింది. పోలీసుల వివరాల ప్రకారం జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 2018లో ఐపీసీ సెక్షన్లు 354, 448తో పాటు పోక్సో చట్టం-2012లోని సెక్షన్‌ 8 కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎస్సీ నంబర్‌ 152/2020గా...