prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:17 pm Digital Edition : PRAJA VANI

జలసిరి పనుల పురోగతిపై జెడ్పీ సీఈఓ గణపతి సమీక్ష

జలసిరి పనుల పురోగతిపై జెడ్పీ సీఈఓ గణపతి సమీక్ష
ప్రతి గ్రామ పంచాయతీలో కూలీల హాజరు పెంచాలి
దండేపల్లి, అక్టోబర్ 14 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ) గణపతి బుధవారం దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జలశ్రీ పనుల పురోగతిపై సంబంధిత సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న జలశ్రీ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పనుల అమలును వేగవంతం చేయడంతో పాటు కూలీల హాజరు సంఖ్యను పెంచాలని సూచించారు. కూలీలకు పని కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో దండేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జేడీ ప్రసాద్, సాంకేతిక సహాయకులు సుభాష్, జగన్, రామ్ కుమార్, అరవింద్, శ్రీనివాస్, క్షేత్ర సహాయకులు కొల్లూరి సతీష్, ముంజంపల్లి సతయ్య, కొత్త సతీష్, ప్రేమ్ సింగ్, నర్సింగ్, సుదర్శన్, సంతపురి శ్రీనివాస్, ఆవునూరి మొగిలి, పల్లె అశోక్ తదితరులు పాల్గొన్నారు.