జర్నలిస్టుల హక్కుల కోసం సమరశంఖం
*జర్నలిస్టుల హక్కుల కోసం సమరశంఖం!* *అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిరసనలు.. *సంగారెడ్డిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు* పటాన్చెరు, అక్టోబర్ 1 (ప్రజావాణి): జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం భారతీయ జర్నలిస్టుల సమాఖ్య పిలుపు మేరకు అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్...