prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 8:32 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

జర్నలిస్టుల సమస్యలపై సమష్టి పోరాటం .

 

.
రాష్ట్ర అధ్యక్షులు నారగోని పోరుషోత్తం, ప్రధానకార్యదర్శి తోకల అనిల్

తొర్రూర్
,అక్టోబర్ 2
(ప్రజా వాణీ)

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై సమష్టిగా పోరాడుతూ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పోరుషోత్తం, ప్రధానకార్యదర్శి తోకల అనిల్, జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ దీర్ పిలుపునిచ్చారు. ఆదివారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఛాంబర్స్ అఫ్ కామర్స్ హాలులో టీఎస్ జేయూ తొర్రూర్ డివిజన్ సమావేశం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పంతం సురేందర్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడిటేషన్‌ కార్డులు ఇప్పించేందుకు యూనియన్ చర్యలు తీసుకుంటోందని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించే విధంగా ఉద్యమించాలన్నారు. అదేవిధంగా నిరంతరం జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని ఆయన సూచించారు. అనంతరం తొర్రూర్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పానుగోత్ బాలాజీ,ఉపాధ్యక్షులుగా వేర్పుల మహేందర్, మంగళపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శులుగా ధర్మారపు యాకయ్య, జెల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా తండ రవి, మునిగేటి గిరిధర్,కోశాధికారి శ్రీనివాస్ చారి, జిల్లా మీడియా ఇంచార్జి మిడతపల్లి సురేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ సభ్యులు పంతం విజేందర్, శ్యామ్, యాకయ్య, ప్రవీణ్, ఉపేందర్, పరశురాం, సతీష్ శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, కృష్ణ , ప్రవీణ్ ఉపేందర్ పరశురాం సతీష్ యాకయ్య శ్రీనివాస్ ఉపేందర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.