జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
జర్నలిస్టుల హక్కుల సాధనలో ఐఎఫ్‌డబ్ల్యూజే కీలక పాత్ర
* జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
* సీనియర్ పాత్రికేయులకు జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి
– టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడు బాపూరావు
– ఘనంగా ఐఎఫ్‌డబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
* జర్నలిస్టులపై దావేతనాల పెంపు, మెరుగైన సేవా నిబంధనలు, పని గంటల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో జర్నలిస్టుల హక్కుల సాధనకు సంస్థ అనేక ఉద్యమాలు చేపట్టిందని గుర్తుచేశారువర్కింగ్ జర్నలిస్టుల చట్టం వేతన సవరణలుపత్రికా రంగానికి సంబంధించిన వివిధ కమిటీల్లో జర్నలిస్టుల ప్రాతినిధ్యం వంటి అంశాల్లో పాత్రికేయ సంఘాల పోరాటాలు కీలకంగా నిలిచాయన్నారుజర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరందేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు హత్యలు బెదిరింపులు అక్రమ కేసుల వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని బాపురావు అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ విధులు నిర్వహించే జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఐఎఫ్‌డబ్ల్యూజే చాలాకాలంగా డిమాండ్ చేస్తోందని తెలిపారుఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని జర్నలిస్టుల భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ పత్రికలు వార్తా సంస్థలు ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను ధ్రువీకరించి జాతీయ స్థాయిలో రిజిస్టర్ రూపొందించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల అర్హులైన జర్నలిస్టుల గుర్తింపు, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ సహాయ కార్యక్రమాల రూపకల్పనకు వెసులుబాటు కలుగుతుందనిపేర్కొన్నారుసీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ కల్పించాలిఅరవై ఏళ్లు దాటిన సీనియర్ జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు దేశవ్యాప్తంగా అమలయ్యే జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని బాపురావుకోరారుజర్నలిస్టులకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే ప్రయాణ రాయితీ పాస్‌లను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం, వైద్య సదుపాయాలు సామాజిక భద్రతకు కూడా ప్రాధాన్యంఇవ్వాలన్నారుసీనియర్ జర్నలిస్టు పిఎస్ రవీంద్రమాట్లాడుతూజర్నలిస్టుల సంఘానికి నాయకత్వం వహించే వ్యక్తి పదవికే పరిమితం కాకుండా, సంఘం బలోపేతానికి నిరంతరం సమయం కేటాయిస్తూ పనిచేయాలని సీనియర్ జర్నలిస్టు పిఎస్ రవీంద్ర అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల హక్కుల సాధన, వృత్తిపరమైన భద్రత, సంక్షేమం కోసం నాయకుడు నిబద్ధతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే దిశగా సంకల్పబలంతో ముందుకు సాగినప్పుడే నాయకత్వానికి సార్థకత చేకూరుతుందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం స్పందించడం, వారి గొంతుకగా నిలవడం, అవసరమైన సందర్భాల్లో అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం నాయకుడి ప్రధాన బాధ్యతలని వివరించారు. సంఘంలోని సభ్యులందరినీ కలుపుకొని పోతూ, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కష్టాల్లో ఉన్న జర్నలిస్టులకు అండగా నిలవడంతోపాటు హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడే వాతావరణాన్ని కల్పించాలన్నారుసంఘం అభివృద్ధి అనేది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదని, నిరంతర కృషి, క్రమశిక్షణ, పారదర్శకత, సేవాభావంతోనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జర్నలిస్టుల సామూహిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే నాయకుడే నిజమైన నాయకుడిగా గుర్తింపు పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల హక్కుల సాధనను ఒక బాధ్యతగా స్వీకరించి, సంఘాన్ని బలోపేతం చేయడమే ప్రతి నాయకుడి ప్రధాన సంకల్పం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదే కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్ము గణేష్, లక్కం సురేష్ సహాయ కార్యదర్శి ఎండి ఖాజా హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ నాయకులు శంకర్ రెడ్డి రాజేంద్రప్రసాద్ నరేష్ దీక్షిత్ రాజు రవి యూసఫ్ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు