prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 2:18 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

— ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నే జర్నలిస్టులు సైతం సేవలందిస్తున్నారు

— పోస్టు కార్డు ఉద్యమ కార్య టియుడబ్ల్యూజే143 అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

అక్రిడిటేషన్ అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే మాదిరిష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ టియూడబ్ల్యూజెహెచ్ -143 ఉత్తరాల ఉద్యమాన్ని కలిగి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 8 రోజులపాటు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టా లని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డు అల్లం నారాయణ, ప్రధాన అస్కాని మారుతీ సాగర్ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లాలో రామ గిరి చౌరస్తాలో ఉన్న గాంధీ జీ గ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. ముందుగా ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు ర్యాలీగా గాంధీ వి గ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు. ప్రతి జర్నలిస్టు పోస్టుకార్డు పై తమ సమస్యలు, డిమాండ్లను రాసి ముఖ్యమంత్రికి చేరేలా కార్యక్ర మాన్ని కొన సాగించాలని. జర్నలిస్టుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేది అధికారులైతే అంతకు మించిన సేవలను అందిస్తూ జర్నలిస్టులు సైతం ఆ పథకాలను ప్రజలకు తెలియజేయడంలో సేవలను అందజేస్తున్నట్లు తెలిపారు. లక్షల్లో వేతనాలు ఇవ్వడంతో పాటు రిటైర్డ్ మెంటు బెన్ఫిట్స్ అందిస్తూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం అదే స్థాయిలో సే వ లు అందజేసే జర్నలిస్టులకు కూడా డిమాండ్ చేశారు. వృత్తిలో నిమగ్నమై నేడు అనేకమంది జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో డబ్బులు లేక చికిత్స చేయించుకోలేక మరణిస్తున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి హెల్త్ కార్డులు ఒక్క నిమ్స్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నా యని ఆ పద్ధతిని మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా జీవో జారీ చేసి క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందించడానికి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు పోస్టుకార్డు లపై క్యాలెస్ హెల్త్ కా ర్డులు డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరు రాసి స్థానిక తపాల కా ర్యాలయం ద్వారా సీఎంలోకి పం పించడం జరిగింది. ప్రభుత్వం వెం టనే స్పందించి జర్నలి స్టుల న్యాయపరమైన డిమాండ్లను నె రవేర్చాలని యూనియన్ నాయ కులు డిమాండ్ చేశారు. లేని ప క్షంలో ఉద్యమాన్ని ఉదృతం చే స్తామని అన్నారు. ఈ కార్య క్ర మంలో యూనియన్ రాష్ట్ర నా యకులు గోలి విజయ్ కుమార్, నకిరేకంటి శ్రీనివాస్ గౌ డ్, నీలం వెంకట మధు, సల్వాది జానయ్య, ముచర్ల విజయ్, ఆ కాష్, ముచర్ల శ్రీనివాస్, నరసింహ రావు, లక్ష్మీ నారాయణ, నరేందర్, జానీ, పోగుల రమేష్ గౌడ్, బొడ్డుపల్లి రామ కృష్ణ, చిక్కుల యాదగిరి, పేరం సుభాష్, శ్రీ కారింగు వెంకన్న, శ్రీ కారింగు వెంకన్న ఉన్నారు.