జన చైతన్య సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా 13వ విజయదశమి వేడుకలు……రిమోట్ ద్వారా రావణ దహనాన్ని ప్రారంభించిన అబ్బసాని యాదగిరి యాదవ్ కుమార్తె

ఘట్‌కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి): జన చైతన్య సేవాసమితి ఆధ్వర్యంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బసాని యాదగిరి యాదవ్ నేతృత్వంలో 13వ విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో రావణ దహనం, బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అబ్బసాని యాదగిరి యాదవ్ కుమార్తె రిమోట్ ద్వారా రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గురుకుల్ కళాశాల మైదానం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. బాణాసంచా ప్రదర్శనతో మైదానమంతా సందడిగా మారింది....