prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 4:06 pm Digital Edition : PRAJA VANI

జనగామ, సిద్దిపేట జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మహదేవుని శ్రీనివాస్

జనగామ, సిద్దిపేట జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మహదేవుని శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19(ప్రజావాణి): జనగామ, సిద్దిపేట జిల్లాల ప్రజలందరికీ, సిద్దిపేట జిల్లా లింగ బలిజ సమాజం అధ్యక్షులు మరియు కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐక్యత, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.

విజయదశమి పండుగ విశిష్టతను వివరిస్తూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విజయదశమికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం, లోకకంటకుడైన రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించిన రోజుగా, అలాగే మహిషాసురుడనే రాక్షసుడిపై దుర్గాదేవి విజయం సాధించిన సందర్భానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం ఎప్పటికైనా విజయం సాధిస్తాయనే గొప్ప సందేశాన్ని విజయదశమి అందిస్తుందని వివరించారు.

విజయదశమి పండుగ మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, స్వార్థం వంటి ప్రతికూల భావాలను విడిచిపెట్టి, సత్యం, ధర్మం, న్యాయం, మానవత్వం, సేవాభావం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని బోధిస్తుందని అన్నారు.

ఈ విజయదశమి పర్వదినం సిద్దిపేట, జనగామ జిల్లాల ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయాలు, సుఖశాంతులు, సకల శుభాలు అందించాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మహదేవుని శ్రీనివాస్ తెలిపారు.