జనగామ లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
జనగామ లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొవ్వొత్తుల ర్యాలీ - అమరవీరులకు ఘన నివాళులు.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 21(ప్రజావాణి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం జనగాం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జనగాం డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ ఆధ్వర్యంలో, జనగాం పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన కూడళ్ల మీదుగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చేతిలో కొవ్వొత్తులు పట్టుకుని "అమరవీరులకు జోహార్" అంటూ నినాదాలు చేస్తూ...