prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:31 pm Digital Edition : PRAJA VANI

జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే పల్లా సతీమణి నీలిమ

వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 17(ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి సతీమణి నీలిమ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి బతుక మ్మ ఆడారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో నియోజకవర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు రంగురంగుల పూలతో బతు కమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి దయాకర్, ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొ న్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందిం చడంలో బతుకమ్మ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ లు గాడిపల్లి ప్రేమలత రెడ్డి, పోకల జమున, మహిళా కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.