జనగామను కరువు మండలంగా ప్రకటించాలి – యాసారపు కరుణాకర్
జనగామను కరువు మండలంగా ప్రకటించాలి - యాసారపు కరుణాకర్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జనగామ మండలం లేకపోవడం దురదృష్టకరమని, దీనివల్ల ఇక్కడి ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతారని మాదిగ మేధావుల ఫోరం జనగామ జిల్లా కోఆర్డినేటర్ యాసారపు కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జనగామలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు లేక జనగామ మండలంలో ఒక్క చెరువు కూడా నిండలేదని...