జగనన్న కాలనీలో అక్రమ నిర్మాణం: నిబంధనలు గాలికొదిలేసి పూజల పేరిట సరికొత్త తంతు! దీని వెనక విఆర్ఓ హస్తం ఉందా లేదా
పోరుమామిళ్ల (కడప జిల్లా):అక్టోబర్ 8 ప్రజావాణి ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారు సొంత గూడు నిర్మించుకోవాలనే సత్సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జగనన్న కాలనీల" ఆశయం ఇక్కడ పక్కదారి పడుతోంది. కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిధిలోని సంచర్ల పంచాయతీ రామేశ్వర గ్రామంలో ఉన్న జగనన్న లేఅవుట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఒక అక్రమ నిర్మాణం వెలిసింది. నిరుపేదలకు కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేస్తూ, ఒక వ్యక్తికి అనధికారికంగా (అనఫీషియల్ గా) రూము కట్టించి ఇవ్వడమే కాకుండా, అందులో నిత్యం పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల...