prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:46 pm Digital Edition : PRAJA VANI

చౌడాపూర్ మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ ఎన్నిక

చౌడాపూర్ మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా కమారం రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా కే. యశ్వంత్

పరిగి, అక్టోబర్04 (ప్రజావాణి):

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) నూతన మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వికారాబాద్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు.. పరిగి డివిజన్ అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కే. శ్రీనివాస్, డివిజన్ ఉపాధ్యక్షుడు వి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పండాల సురేష్, డివిజన్ కార్యదర్శి కోస్గి కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షుడు: కమారం రామస్వామి
ప్రధాన కార్యదర్శి: కే. యశ్వంత్
ఉపాధ్యక్షుడు: జోగు శ్రీనయ్య (శ్రీను)
కార్యదర్శులు: పరిగి అశోక్, కొత్త యాదయ్య
ఆర్గనైజింగ్ కార్యదర్శి: డాక్టర్ బి. వెంకటేష్
కోశాధికారి: సంటి చందు
కార్యవర్గ సభ్యులు: నసీర్, బుచ్చయ్య, కోస్గి కుమార్, ఎం. కొండయ్య, శేఖర్, బ్యాగరి శ్రీను, కావాలి నవీన్, మొగిలిగిద్ద గిరి, హన్మంత్ రెడ్డి
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కమారం రామస్వామి మాట్లాడుతూ.. మండలంలోని వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు నాయకులు, పాత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు.