చేర్యాల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ గా బోయిని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం
శాలువ కప్పి ఘనంగా సన్మానించిన ప్రజా ప్రతి నిధులు,నాయకులు
మద్దూరు అక్టోబర్6, ప్రజా వాణి,
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ గా మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా మీద నమ్మకంతో వైస్ చైర్మన్ పదవికి ఎంపిక చేసిన మాజీ ఎమ్మెల్యే నియోజక వర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మండల అద్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎల్లవేళల కృషి చేస్తానని అన్నారు.