prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 9:40 am Digital Edition : PRAJA VANI

చేపల వేటకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి
రాత్రి చెరువులోకి వెళ్లిన రాజేష్‌.. తెల్లవారుజామున లభించిన మృతదేహం
కూసుమంచి, ప్రజావాణి:
చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో నీట మునిగి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెన్నబోయిన రాజేష్‌ (34) ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అయితే, రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో చెరువు గట్టుపై రాజేష్‌ చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో తెల్లవారుజామున రాజేష్‌ మృతదేహం లభ్యమైంది. అప్పటివరకు తమతో ఉన్న వ్యక్తి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. రాజేష్‌ మృతితో నేలపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.