చేతులు కడుక్కునే ప్రదేశంలో దుర్వాసన,శుభ్రం చేయాలని పోరుమామిళ్ల గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల డిమాండ్
వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల అక్టోబర్ 2 ప్రజావాణి మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల లేమి, పారిశుధ్య లోపంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు అన్నం తిన్న తర్వాత ప్లేట్లు కడుక్కునే, అలాగే చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం అత్యంత అధ్వాన్నంగా తయారైందని వారు ఆవేదన చెందుతున్నారు. అపరిశుభ్రంగా మారిన ప్రదేశం: నిత్యం వందలాది మంది విద్యార్థులు ఉపయోగించే ఈ నీటి కుళాయిల వద్ద సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో...