prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 5:44 pm Digital Edition : PRAJA VANI

చేగుంట, నార్సింగి మండలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండి

చేగుంట, నార్సింగి మండలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండి

మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మెదక్ జిల్లాకు చెందిన చేగుంట, నార్సింగి మండలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
రెండు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే.. ఆయా మండలాల్లోని గ్రామాల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమస్యలపై చర్చించారు.
గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
చేగుంట, నార్సింగి మండలాల్లో కలెక్టర్ స్వయంగా పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ఆయా మండలాల సమస్యలు, అభివృద్ధి అవసరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రెండు మండలాల సమగ్ర అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.