prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 4:38 pm Digital Edition : PRAJA VANI

చెలమల్ల ముత్తయ్యకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే నివాళి

చెలమల్ల ముత్తయ్యకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే నివాళి

నరసింహులపేట- ప్రజావాణి అక్టోబర్ 3:
నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన చెలమల్ల ముత్తయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డి.ఎస్. రెడ్యానాయక్ పెద్దనాగారం గ్రామానికి చేరుకుని ముత్తయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ముత్తయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ముత్తయ్య మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు, గ్రామస్తులకు తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుజి వీరస్వామి, కొమ్ము మధు, గడుదుల కొమురెల్లి, టేకుల రవి, గుజి వెంకన్న, చలమల్ల పాపయ్య, కొమ్ము వీరభద్రం, కర్ణ శ్రీకాంత్, గంట మహేష్, చల్లమల్ల ఉపేందర్, బొబ్బ లింగారెడ్డి, అల్లవరపు దామోదర్ రెడ్డి, కృష్ణ, లక్ష్మయ్య, భాస్కర్, దుర్గయ్య, పుల్లయ్య, నర్సిరెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.