చెరువు మాదారంలో దొంగతనం…!
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సుమారు 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ…?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాదారంలో గత రెండు రోజుల క్రితం దొంగలు ఓ ఇంట్లోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బంగారు ఆభరణాలు చోరీ అయిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎస్సై శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో బాధితుల గృహాన్ని పరిశీలించారు. కాగా చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు 7 లక్షల నుండి 8 లక్షల మధ్యలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు విచారణ వేగవంతంగా చేస్తున్నట్లు సమాచారం.
