prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 2:22 pm Digital Edition : PRAJA VANI

చెప్పాం..చేస్తున్నాం

చెప్పాం..చేస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, శాసన సభ్యులు, పొన్నూరు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 పొన్నూరు, గుంటూరు జిల్లా

కొమ్మమూరు కాలువపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.68 కోట్లకు ప్రభుత్వ అనుమతులు పొందడం చాలా సంతోషాన్నిచ్చింది

ప్రజలకు మేమిచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి అనునిత్యం పని చేస్తున్నాం, కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దక్కినపుడు పడిన కష్టం అంతా మర్చిపోయి మరింత ఉత్సాహంగా పని చేసేందుకు దోహదపడతాయి

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలే కాక ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నాం

కేవలం ఓట్ల కోసం చేసే రాజకీయాలు చెల్లవ్! ప్రజలకు చిత్త శుద్ధితో సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని నమ్మి ఐదు దశాబ్దాలుగా పొన్నూరు ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాం

గుంటూరు–చీరాల ప్రధాన రహదారిలో కిలోమీటర్ 15/8 వద్ద కొమ్మమూరు కాలువపై 1865లో నిర్మించిన పాత వంతెన 2017 ఆగస్టులో కొంత భాగం దెబ్బతింది. నూతన వంతెన నిర్మాణానికి 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. అనంతరం Inland Waterways Authority నిబంధనల ప్రకారం అంచనాలు సవరించడంతో నిర్మాణ వ్యయం రూ.46 కోట్లకు చేరింది, డిజైన్ మార్పుల కారణంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అదనపు నిధుల అవసరం ఏర్పడటంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా నేడు సవరించిన మొత్తంతో పరిపాలనా అనుమతులు జారీచేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు

ఇటీవల భారీ వాహనం ఢీ కొట్టడంతో దెబ్బతిన్న బ్రిడ్జి మరమ్మత్తు పనులు ₹24.90 లక్షల వ్యయంతో వేగంగా పనులు పూర్తి చేయడం జరిగింది

త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం