చెన్నాయపల్లి గ్రామంలో ఘనంగా దేవి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం

*చెన్నాయపల్లి గ్రామంలో ఘనంగా దేవి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం* చిన్నశంకరంపేట,అక్టోబర్11 మన ప్రజావాణి: చిన్నశంకరంపేట మండల పరిధిలోని చెన్నాయపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు. దేవీ నవరాత్రులలో భాగంగా మొదటి రోజైన బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారు. అనంతరం పంతులు రఘురాం శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన, అభిషేకం, లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.