prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 7:31 pm Digital Edition : MAHESH MEDCHAL

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి

*ప్రజలందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సల్ల వెంకటేష్ యాదవ్*

*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి*

*ఉమ్మడి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సల్ల వెంకటేష్ యాదవ్*

మేడ్చల్ ప్రజావాణి:- ఉమ్మడి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సల్ల వెంకటేష్ యాదవ్ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు.
విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో, సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దసరా పండుగ చెడును విడిచిపెట్టి మంచిని ఆచరించాలనే సందేశాన్ని అందిస్తుందని, ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, న్యాయం పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని అన్నారు. సమాజంలో ప్రేమాభిమానాలు పెంపొందించుకుంటూ, పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని, యువత తమ లక్ష్యాలను సాధిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సల్ల వెంకటేష్ యాదవ్ ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను సంతోషంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుతూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.