prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 11:50 am Digital Edition : PRAJA VANI

చెండేగావ్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మణ్ సమక్షంలో ఇంటింటికి ఇంకుడు గుంత.

చెండేగావ్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మణ్ సమక్షంలో ఇంటింటికి ఇంకుడు గుంత.

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చెండేగావ్ గ్రామంలో బుధవారం రోజు ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు… ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ వారి సమక్షంలోనే ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ఇంకుడు గుంట ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడారు.. నీరు రోడ్లపైన రాకుండా ఉండాలంటే ఇంకుడు గుంటను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి దోమల వలన ఇబ్బందులకు గురికాకుండా ఉంటామని కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ లక్ష్మణ్ గ్రామస్తులకు తెలియజేశారు.. కొంతమంది గ్రామస్తులు ముందుకు వచ్చి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటామని అన్నారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ తోపాటు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వికాస్ రెడ్డి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు..