prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 7:14 am Digital Edition : MEERASAHAB CHILUKUR

చిలుకూరులో నేడు ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం

 

రబీ పంటల ప్రణాళికపై సీఎం సందేశం.. రైతులకు అవగాహన

చిలుకూరు,అక్టోబర్ 11, ప్రజావాణి:తెలంగాణ ముఖ్యమంత్రి రైతాంగాన్ని ఉద్దేశించి ప్రసంగించే ‘రైతు నేస్తం’ కార్యక్రమం అక్టోబర్ 12న ఉదయం 11 గంటల నుంచి చిలుకూరు మండలంలోని రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌లో పంటల ఎంపిక, పంటల వైవిధ్యీకరణ, శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం మేరకు.. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు ఉదయం 11 గంటలకు రైతు వేదికలకు చేరుకొని కార్యక్రమంలో పాల్గొనాలని మండల వ్యవసాయ అధికారి కోరారు.