చిరు వ్యాపారుల అడ్డాల తొలగింపుపై బీజేపీ ఆగ్రహం

చిరు వ్యాపారుల అడ్డాల తొలగింపుపై బీజేపీ ఆగ్రహం హైకోర్టు స్టేను గౌరవించి అధికారులు సహకరించాలి: చందుపట్ల కీర్తిరెడ్డి భూపాలపల్లి, అక్టోబర్ 6 మన ప్రజావాణి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో చిరు వ్యాపారుల అడ్డాలను భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసిన ప్రదేశంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు, స్టే ప్రకారం అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు. 2014లో...