చిన్న యరసాల గ్రామ ప్రగతి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి పోటీ: ‘విండో ఏసీ’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి!
పోరుమామిళ్ల: అక్టోబర్క 29 ప్రజావాణి డప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్న యరసాల పంచాయతీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిరుపేదలు, సామాన్యుల పక్షాన నిలబడి, గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించడమే ధ్యేయంగా పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి చిన్న యరసాల MPTC స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే పట్టుదలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జీవనోపాధి కోసం వెళ్లినా.. సొంత ఊరిపై మమకారంతో: పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ వారసత్వం, బంధుమిత్రులంతా ఇక్కడే, వీరు జీవనోపాధి...