prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 1:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చిన్న యరసాల గ్రామ ప్రగతి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి పోటీ: ‘విండో ఏసీ’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి!

పోరుమామిళ్ల: అక్టోబర్క 29 ప్రజావాణి డప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్న యరసాల పంచాయతీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిరుపేదలు, సామాన్యుల పక్షాన నిలబడి, గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించడమే ధ్యేయంగా పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి చిన్న యరసాల MPTC స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే పట్టుదలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

జీవనోపాధి కోసం వెళ్లినా.. సొంత ఊరిపై మమకారంతో:

పాలకొలను హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ వారసత్వం, బంధుమిత్రులంతా ఇక్కడే, వీరు జీవనోపాధి నిమిత్తం రామిరెడ్డి కుంట ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉన్నా  మాత్రాన సొంత గడ్డ అయిన చిన్న యరసాల గ్రామ ప్రజల కష్టసుఖాలు, ఊరి అభివృద్ధిపై వారికి ఎనలేని మమకారం ఉంది. మాతృభూమికి, ఇక్కడి ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపనతోనే హర్షవర్ధన్ రెడ్డి నేడు మీ ముందుకు వచ్చారు.

మీరే నా బలం.. మీరే నా ధైర్యం:

“చిన్న యరసాల గ్రామ ప్రజల ఆశీస్సులు, మద్దతు నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల అండదండలే నాకు కొండంత బలం మరియు ధైర్యం” అని హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా, కేవలం ప్రజా సేవకు అంకితమవ్వడమే తన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.రాబోయే 05-11-2026 న జరగబోయే ఎన్నికలలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి, ‘విండో ఏసీ’ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో తనును గెలిపించాలని ఆయన గ్రామ ఓటర్లను, పెద్దలను, యువకులను భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. మన ఓటు ద్వారానే అభివృద్ధికి బాటలు వేసుకుందామని, చిన్న యరసాల పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు.