prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 10:11 am Digital Edition : PRAJA VANI

చిన్న మండవ వ్యవహారంలో అధికారుల ఉదాసీనత

చిన్న మండవ వ్యవహారంలో అధికారుల ఉదాసీనత…?

*ఉలుకు పలుకులేని అధికార యంత్రాంగం..?

ఆగ మేఘాల మీద రెవెన్యూ సమావేశం…?

ఇంతకీ…!

మ్యానువల్ బిల్లులు అక్రమ వసూళ్లపై విచారణ చేస్తారా… లేక సద్దుబాటు చేస్తారా…?

ఆగ మాగం అగమ్య గోచారం..

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ ప్రభుత్వ ఇసుక క్వారీ వద్ద రెవెన్యూ ఉద్యోగుల అక్రమ బినామీ ఫోన్ పేలు మ్యానువల్ బిల్లులపై సంబంధిత శాఖ అధికారులు ఆరా తీసి సర్దుబాటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి అనుమతులు అనే సాకుతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సంబంధిత రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరించడం సంచలనం కలిగిస్తోందని సమాచారం. మన ప్రజావాణి వరుస కథనాలకు జిల్లా స్థాయి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కానీ యధావిధిగా సర్దుబాటు చేసుకున్నట్లు పలువురు మండల ప్రజలు స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మన ప్రజావాణి కథనంలో పేర్కొన్న అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ కొందరు ప్రశ్నించే గొంతుకలు సైతం నైతిక మద్దతు ప్రకటించడం విశేషం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న మ్యానువల్ బిల్లులపై అక్రమ వసూళ్లపై సమగ్రంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.