prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 10:35 am Digital Edition : PRAJA VANI

చిన్న పోచారంలో వైభవంగా శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు

చిన్న పోచారంలో వైభవంగా శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో కనకదుర్గ అమ్మవారి మాలధారణ.. నిష్ఠతో ప్రత్యేక పూజలు
కూసుమంచి, అక్టోబర్ 21 మన ప్రజావాణి రిపోర్టర్ RK: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు అమ్మవారి మాలధారణ చేసి, నిష్ఠతో నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజూ భక్తి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఉత్సవాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని గుడిపాటి రామ్మూర్తి, ఆయన సతీమణి రమాదేవి, వారి కుమారులు సాయి వినయ్, ప్రశాంత్ దాతృత్వంతో సమకూర్చారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. గ్రామస్తులు ఉత్సవాల్లో పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.