*చిన్నమండవలో అక్రమం ఆగనంటుందా…?
*ఇందిరమ్మ సాకుతో లక్షలాది రూపాయలు స్వాహా..?
*చేతిరాతలతో బిల్లులు…?
*ఫోన్ పేలు బినామీలు..?
*చింతకాని రెవెన్యూ శాఖలో అక్రమ బిల్లులు వసూళ్ల పర్వం..?
*అధికారుల నిర్లక్ష్యంతో నిఘా శాఖల మొద్దు నిద్రతో దండుకుంటున్న అక్రమార్కులు…?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
రాజు ఆజ్ఞలే.. శాసనాలు.. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల అండదండలు పుష్కలం.. దీంతో అక్రమార్కులు నిన్న మొన్నటి దాకా రెచ్చిపోయారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ గ్రామపంచాయతీ పరిధిలో మున్నేరు నది పరివాహ ప్రాంతంలో ఇసుక భారీగా ప్రతి ఏడాది చేరుతూ ఉంటుంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు బడా బాబులు లక్షలాది రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వార్త కథనాలకు తోడు అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడంతో తాత్కాలికంగా ఇసుకను అక్రమార్కులు తరలించకుండా కందకాలు తీసినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను అందించే ఉద్దేశంతో ఇటీవల ఆ గ్రామపంచాయతీ పరిధిలో నాగులవంచ 2 జిపిఓను ఇన్చార్జిగా నియమించి ఇసుక కూపన్ల మంజూరు రవాణా లాంటి బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. దీంతో సదరు జిపిఓ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఓ ప్రైవేటు ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు ఆమోదముద్ర వేస్తూ అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసే కూపన్ల కోసం మీ సేవలో దరఖాస్తులను ఫార్మేట్ ప్రకారం అందించిన ట్రాక్టర్ యజమానులు వ్యాపారులు ఎటువంటి ఓటీపీలు ఓసీలు లేకుండా డైరెక్ట్గా సదరు జిపిఓ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు ఆమోదముద్ర చేస్తూ లోకల్ ట్రాక్టర్లకు 500 నుండి 800 వరకు ముదిగొండ మండలం పలు గ్రామాలకు చెందిన ట్రాక్టర్లకు వెయ్యి రూపాయలు చొప్పున అక్రమ వసూళ్లు చేస్తూ దండిగా దండుకుంటున్నట్లు విమర్శలు జోరుగా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో విధులు నిర్వహించే ఓ రెవెన్యూ ఉద్యోగి అనారోగ్యంతో మంచాన పడటంతో సదరు ఉద్యోగి వారసుడు ఈ అక్రమ వసూళ్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఫోన్ పేలు గూగుల్ పేలు కాకుండా డైరెక్ట్ గా లిక్విడ్ క్యాష్ ను వసూలు చేస్తున్నట్లు వసూలు చేసిన మొత్తాన్ని సాయంత్రం ఐదు గంటల తర్వాత పంపకాలు చేస్తున్నట్లు పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా అక్రమ సంపాదనకు రుచి మరిది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు స్థానికులు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
కాగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న సంబంధిత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ మైనింగ్ శాఖలో మొద్దు నిద్రలో జోగుతున్నట్లు పలువురు స్థానికులు మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణ చేయాలని పలువురు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
*కూర్చున్న ఇంటికే రోజుకు 500 రూపాయలు..? ఉదయం సాయంత్రం హాజరు కోసం ఊరు బయట విధులు.. ఆ తర్వాత అంతా అక్రమమే నా..?
రేపటి సమగ్ర కథనం..2 లో వేచి చూడండి…!