చిన్ననాగారంలో బతుకమ్మలకు బహుమతులు
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా
ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో సద్దుల బతుకమ్మ పురస్కరించుకుని సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అందమైన బతుకమ్మలకు స్థానిక బిఆర్ఎస్ నాయకులు బహుమతులు అందజేశారు.ప్రధమ బహుమతి చెడు పాక కవిత గెలుచుకోగా దాతలు చెడుపాక యాకూబ్ కవితలు అందజేశారు. ద్వితీయ బహుమతి గుండ్ల అరుణ కైవసం చేసుకోగా బహుకరణ దాత వార్డు సభ్యులు బైరు వినయ్ గౌడ్ ప్రవళిక దంపతులు ప్రజెంటేషన్ చేశారు.
తృతీయ కౌటం రజిత గెలుచుకోగా దాతలు మద్దెల సుధాకర్ గౌడ్ నీరజ దంపతులు అందజేశారు. చతుర్ధ బహుమతి చెడుపాక దేవేంద్ర సాధించగా దాతలు చెడుపాక శ్రీనివాస్ రేణుక దంపతులు విజేతకు అందజేశారు.