prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:36 pm Digital Edition : PRAJA VANI

చిట్టాపూర్ అభివృద్ధి పనులపై వినతి

*చిట్టాపూర్ అభివృద్ధి పనులపై వినతి*..

*అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి*

దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని చిట్టాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు, నీటి ఎద్దడి నివారణకు బోర్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, ర్యాకం శ్రీరాములు,ఇరుకోటి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి బాల్ నర్సింలు, గ్రామ ఫిషర్మెన్ అధ్యక్షులు జంగి బిక్షపతి ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సిద్ధిని రాజ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..