చికిత్స పొందుతున్న ఆర్ఎంపీ మృతి
అక్టోబర్ 28.ప్రజావాణి న్యూస్/సంగెం
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఆర్ఎంపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళ వారం చోటు చేసుకుంది. వివరాలిలా..సంగెం మండలంలోని రామచంద్రాపురానికి చెందిన ఆర్ఎంపీ కడారి శ్రీనివాస్ ఈనెల 24న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు.మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.మృతుని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ బాబు తెలిపారు.