కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
గుజరాత్ రాష్ట్రం లోని ప్రపంచ ప్రసిద్ధ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న చింతన్ శివిర్ –2026 రెండు రోజుల కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రాల అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, రహదారుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ఈ చింతన్ శివిర్‌లో చర్చలు జరిగే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మౌలిక వసతుల విస్తరణ, రహదారి భద్రత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన వంటి అంశాలపై చింతన్ శివిర్‌లో అభిప్రాయాల మార్పిడి జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి చింతన్ శివిర్ ను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా ఈ వేదిక ద్వారా చర్చలకు అవకాశం లభించనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ఫలితాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించి, పరస్పర అనుభవాలను పంచుకునే అవకాశం ఉంది. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారించనున్నారు.