చించోల్లిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

బీర్కూర్ మండలం చించోల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోసల్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ శేఖర్ గ్రామస్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరయ్యారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్థులంతా ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందంగా ఉందని...