prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 7:34 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

చర్చి ప్రహరీ గోడ కూల్చివేత. బిషప్‌కు ప్రాణహాని బెదిరింపులు!

చర్చి ప్రహరీ గోడ కూల్చివేత. బిషప్‌కు ప్రాణహాని బెదిరింపులు!

 

ప్రార్థన చేస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు – బిషప్ దుర్గం ప్రభాకర్ సంచలన ఆరోపణలు.

 

హుజూర్నగర్ అక్టోబర్ 1 (ప్రజావాణి)

 

సూర్యాపేట రూరల్ మండలం కేసారం గ్రామంలో దారుణం. బేతెస్థ ప్రార్థనా మందిరం ప్రహరీ గోడ బేసిమెంట్‌ను కొందరు అక్రమంగా కూల్చివేశారని బిషప్ దుర్గం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్.ఎం.పి డాక్టర్ చింత ఇంద్రయ్య, ఆయన భార్య అంగన్‌వాడీ టీచర్ చింత సుధారాణి వారి కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని బిషప్ సంచలన ఆరోపణలు చేశారు. చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.

తనను హతమార్చేందుకు సుపారీ ఇచ్చినట్లు కొందరు ఫోన్ చేసి చెప్పారని, భయంతో నాలుగు వారాలుగా చర్చికి వెళ్లడం లేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు, మరోసారి ఫిర్యాదు చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీని కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొగిలి ఎల్లయ్య, అబ్రహం, సుధాకర్, కరుణశ్రీ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.