చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత!
మానవ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించాలి
లోకాసమస్త హ్యూమన్ రైట్స్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ
హైదరాబాద్, అక్టోబర్ 8: మానవ హక్కుల పరిరక్షణ, ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ ఫౌండర్, నేషనల్ చైర్మన్ జి.పి. నరసింహులు అన్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని విశ్వకర్మ బాయ్స్ హాస్టల్ హాల్‌లో తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సభ్యత్వం పొందిన సభ్యులకు సంస్థ విధివిధానాలపై అవగాహన కల్పిస్తూ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యులకు గుర్తింపు కార్డుల వినియోగ విధానం, సభ్యుల బాధ్యతలు, సంస్థ నియమ నిబంధనలపై వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితులకు సరైన న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించడం, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
సంస్థ ప్రతినిధులు, లీగల్ అడ్వైజర్లు మాట్లాడుతూ సంస్థ గుర్తింపు కార్డులు సభ్యుని సంస్థతో ఉన్న అనుబంధాన్ని సూచించేవి మాత్రమేనని, అవి ప్రభుత్వ, పోలీస్ లేదా న్యాయ అధికారిక గుర్తింపు కార్డులు కావని స్పష్టం చేశారు. కార్డులను దుర్వినియోగం చేయడం, తప్పుడు సమాచారం అందించడం, సంస్థ పేరుతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం లేదా సంస్థ నియమావళిని ఉల్లంఘించడం జరిగితే సంబంధిత సభ్యులపై సంస్థపరమైన చర్యలతో పాటు అవసరమైనప్పుడు చట్టపరమైన అధికారులకు సమాచారం అందిస్తామని తెలిపారు.
ప్రతి సభ్యుడు చట్టాన్ని గౌరవిస్తూ నిజాయితీగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించడంతో పాటు మానవ హక్కుల పరిరక్�