చండూరు విద్యావేత్త డా. ఇ. శ్రీనివాసచారికి ‘టీచర్ ఎక్సలెన్స్ అవార్డు’
చండూరు విద్యావేత్త డా. ఇ. శ్రీనివాసచారికి ‘టీచర్ ఎక్సలెన్స్ అవార్డు’ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, తెలుగు అధ్యాపకుడు డా. ఇ. శ్రీనివాసచారి విద్యారంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. విద్యార్థుల విద్యాభివృద్ధి, తెలుగు భాషా–సాహిత్య బోధన, ఉపాధ్యాయ శిక్షణ, విద్యా సామగ్రి రూపకల్పన, బోధనా నైపుణ్యాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయనను ‘టీచర్ ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపిక చేశారు. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ ఉపాధ్యాయ...