ఘనపూర్‌లో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు…ముఖ్య అతిథులుగా వేముల మమత మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి
ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 8వ డివిజన్ ఘనపూర్‌లో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేముల మమత మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ...