prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 5:35 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘనపూర్‌లో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు…ముఖ్య అతిథులుగా వేముల మమత మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని ఎదులాబాద్‌ 8వ డివిజన్‌ ఘనపూర్‌లో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేముల మమత మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఆత్మీయతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.

నేతాజీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఘనపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది