prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 12:42 pm Digital Edition : BALAKRISHNA BIRKOOR

ఘనంగా సోషల్ వర్కర్ సందుల గంగారం జన్మదిన వేడుకలు

సామాజిక ఆశయ సాధన సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, సోషల్ వర్కర్ సందుల గంగారం జన్మదిన వేడుకలను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఆదివారం బాన్సువాడ పట్టణంలోని పీఎస్ఆర్ పార్కులో గల గౌతమ బుద్ధుని సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకల్లో గంగారాంకు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్. నర్సింలు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు మైసయ్య, బాన్సువాడ డివిజన్ ఉపాధ్యక్షుడు మన్నె చిన్న సాయిలు, బోర్లం గ్రామ మాల మహానాడు అధ్యక్షుడు బేగరి డాక్టర్ సాయిలు, అంబేద్కర్ సంఘం సభ్యులు మన్నె సురేష్, సక్కి దుర్కి సురేష్ తదితరులు పాల్గొన్నారు.