ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రజావాణి, అక్టోబర్12
సదుం: మండలంలో రెండో రోజు శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సదుంలోని శ్రీ సదమమ్మ ఆలయం, పాపి రెడ్డి గారి పల్లెలో శ్రీ ఎల్లమ్మ, జాండ్రపేటలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి, పచ్చారు మాకులపల్లిలోని శ్రీ గంగాపురమ్మ ఆలయంలో అమ్మవార్లను మహా లక్ష్మీ అలంకరణ చేశారు. ఉదయం సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం విశేషంగా అలంకరించారు. అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అదేవిధంగా శివకోన సిద్దేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. చెరకు వారి పల్లె లోని శివాలయం లో స్వామి వారికి, పార్వతీ దేవి కి విశేషంగా పూజలు చేసి అలంకరించారు.