prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 7:36 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘనంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చందుపట్ల లక్ష్మారెడ్డి 50వ జన్మదిన వేడుకలు 

ఘట్కేసర్, అక్టోబర్ 8 (ప్రజావాణి): ఘట్కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చందుపట్ల లక్ష్మారెడ్డి 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొని చందుపట్ల లక్ష్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న లయన్ సభ్యులందరికీ చందుపట్ల లక్ష్మారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ బచ్చు నగేష్ గుప్త, ట్రెజరర్ రవికుమార్, చార్టర్డ్ లయన్ సారా శ్రీనివాస్ గౌడ్, మారం లక్ష్మారెడ్డి, కమలాకర్, రామ్మోహన్, సారా మురళి, నర్సింగరావు, లక్ష్మి, హిమబిందు, మడిపడిగా రాజు, కోవా రాము, విష్ణువర్ధన్ రెడ్డి, ఘట్కేసర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.