prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 8:30 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

*ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు*

*గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భీరం శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో*

గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 31. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, మాజీ ప్రధానమంత్రి ఉక్కుమనిషి ధీరవనిత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయురాలి చిత్రపటానికి పూలమాలవేసి, పూలతో ఘన నివాళులు అర్పించిన గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ పాల్గొన్నారు. వారితో పాటు గూడూరు ఉపసర్పంచ్ చంటి స్వామి, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి ఎండి. రసూల్, గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రూపురెడ్డి వెంకట్ రెడ్డి, తంగళ్ళపల్లి సునీల్, మైనార్టీ మండల నాయకులు చాంద్ పాషా, పంజరబోయిన శ్రీను, మండల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు షాజహాన్ రాజేష్, పాషా, ముఖ్య కార్యకర్తలు, మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.