ఘనంగా మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి
ఘనంగా మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి కూసుమంచి ప్రజావాణి, అక్టోబర్ 5: కూసుమంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో సోమవారం మాజీ ఎంపీ శ్రీ గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో MPDOతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని గడ్డం వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.