prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:42 am Digital Edition : PRAJA VANI

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు

నాగర్ కర్నూల్ జిల్లా..
కల్వకుర్తి నియోజకవర్గం:
అక్టోబర్ 19/ప్రజావాణి ప్రతినిధి.

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలో బలరాం నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. సందర్భంగా ఆటల పోటీలతోపాటు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. అదే విధంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఆటల పోటీలు, విద్యార్థుల తల్లులతో కలిసి బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రథమ స్వచ్ఛంద సంస్థ జిల్లా కో -అర్డినేటర్ బొల్లె పర్వతాలు,కల్వకుర్తి మండల కో-ఆర్డినేటర్ సృజన లు మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొంటూ, ఈ కార్యక్ర మాన్ని నిర్వహించిన సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.